తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​తో దౌత్య సంబంధాల తెంపునకు పాక్ నిర్ణయం

భారత్​తో దౌత్య సంబంధాలు తెంచుకునేందుకు పాక్​ సిద్ధమయింది. కశ్మీర్​పై చర్చించేందుకు ఏర్పాటు చేసిన పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్.

పాక్​

By

Published : Aug 7, 2019, 7:42 PM IST

Updated : Aug 7, 2019, 8:44 PM IST

జమ్ము కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో పాక్​ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్​తో దౌత్య సంబంధాలను తెంచుకోనేందుకు పాకిస్థాన్ సిద్ధమయింది. జమ్ముకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ రెండో సారి నిర్వహించిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భేటీలో తీసుకున్న నిర్ణయాలు

  • భారత్​తో దౌత్య సంబంధాలు తెంచుకోవటం
  • పాకిస్తాన్‌ హైకమిషనర్‌ను భారత్‌కు పంపకూడదని నిర్ణయం
  • పాక్‌లోని భారత హైకమిషనర్‌నూ వెనక్కి వెళ్లాలని కోరే అవకాశం
  • ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం రద్దు
  • ద్వైపాక్షిక చర్చలు, సంబంధాలపై పునఃసమీక్ష

భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కశ్మీరీల హక్కులను కాలరాస్తోందని ఇప్పటికే పాకిస్థాన్​ విమర్శించింది. కశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ ఉపసంహరించుకున్న తర్వాత పరిణామాలు, అవలంబించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.

జాతీయ భద్రత కమిటీ సమావేశంలో పాక్​ విదేశాంగ మంత్రి, కశ్మీర్ వ్యవహారాల మంత్రి, ఇతర ముఖ్య అధికారులతో పాటు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

Last Updated : Aug 7, 2019, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details