తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ ముక్కలవడం తథ్యం: రాజ్​నాథ్​ జోస్యం

బలూచిస్థాన్​, సింధ్ సహా దాయాది పాకిస్థాన్​లోని పలు ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన వార్తల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు రక్షణమంత్రి రాజ్​నాథ్ ​సింగ్. మానవ హక్కులను కాపాడకపోతే పాక్ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

By

Published : Sep 22, 2019, 4:49 PM IST

Updated : Oct 1, 2019, 2:23 PM IST

'మానవ హక్కుల ఉల్లంఘనతో పాక్ మనుగడకే ముప్పు'

పాక్​ ముక్కలవడం తథ్యం: రాజ్​నాథ్​ జోస్యం

1965, 1971 యుద్ధాల తరహాలో పాకిస్థాన్​ దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్. పాకిస్థాన్​ భూభాగంలో తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అదే ఆ దేశానికి శాపంగా మారుతుందని జోస్యం చెప్పారు.

బిహార్​ రాజధాని పట్నాలో భాజపా నిర్వహించిన జన్ జాగరణ్​ సభలో ప్రసంగించారు రాజ్​నాథ్​.

"జాతి, మతం, సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన పాకిస్థాన్ పరిస్థితి ఏమైంది? 1971లో పాక్, బంగ్లాదేశ్ రెండు భాగాలుగా విడిపోయాయి. బలూచిస్థాన్ ప్రజలు, పస్థునియుల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఆ దేశాన్ని ఖండఖండాలుగా విడగొట్టినా ఎలాంటి నష్టం లేదు. పాక్​ను విడగొట్టే అవసరం ఎవరికీ లేదు. దానికదే నష్టం చేకూర్చుకుంటూ విడిపోతుంది. ఇలాంటి వర్గ రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు."

-రాజ్​నాథ్ ​సింగ్, రక్షణ మంత్రి

370వ అధికరణ రద్దును ప్రస్తావించారు రాజ్​నాథ్​. ఆ నిర్ణయానికి జమ్ముకశ్మీర్​లోని నాలుగింట మూడొంతుల మందికిపైగా ప్రజలు మద్దతిస్తున్నారని చెప్పారు. కశ్మీర్​లో అశాంతి సృష్టించే లక్ష్యంతో పాకిస్థాన్​ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇదీ చూడండి: మోదీజీ... పాక్​ చెర నుంచి రక్షించండి: సింధి సంఘాలు

Last Updated : Oct 1, 2019, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details