పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి.. పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. మోర్టార్లు, చిన్నపాటి ఆయుధాలతో దాయాది సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. భారత బలగాలు పాక్ కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
తీరుమారని పాక్.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు - Pak shelling
పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. భారత భద్రతా దళాలు దాడిని దీటుగా తిప్పికొడుతున్నాయి.
జమ్ము కశ్మీర్: నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు