తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మ అవార్డుల దరఖాస్తుకు 15 వరకు గడువు - పద్మ అవార్డు నామినేషన్లు

పద్మ పురస్కారాలకు వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. దరఖాస్తు కేవలం ఆన్​లైన్​ ద్వారా మాత్రమే పంపాలని సూచించింది.

Padma awards nominations open till Sept 15: MHA
పద్మ అవార్డుల దరఖాస్తుకు వచ్చేనెల 15 వరకు గడువు

By

Published : Aug 28, 2020, 9:52 PM IST

వచ్చే నెల 15వ తేదీ వరకు పద్మ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ దరఖాస్తులు లేదా సిఫార్సు‌లను కేవలం ఆన్‌లైన్‌ద్వారా మాత్రమే పంపాలని సూచించింది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే పద్మ పురస్కారాలకు మే ఒకటో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివిధ రంగాల్లో గొప్ప విజయాలు సాధించడం సహా తమ జీవితమంతా సమాజాభివృద్ధి కోసం కృషి చేసేవారికి ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకు 8,035 రిజిస్ట్రేషన్లు పోర్టల్​‌లో జరిగాయని... అందులో 6,361 నామినేషన్లు, సిఫార్సులు పూర్తయ్యాయని హోంశాఖ తెలిపింది.

ప్రజలకు పెద్దగా పరిచయం లేనివారినే కొన్నేళ్ల నుంచి మోదీ సర్కార్‌ పద్మ అవార్డులకు ఎంపిక చేస్తోంది.

ఇదీ చూడండి:కరోనాతో కాంగ్రెస్​ ఎంపీ వసంత కుమార్​ మృతి

ABOUT THE AUTHOR

...view details