తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో వికసించిన 'పద్మాలు' - ఫుట్​బాల్​ క్రీడాకారుడు సునీల్​ ఛేత్రి

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులు పురస్కారాలను అందుకున్నారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మ' పురస్కారాల ప్రదానం

By

Published : Mar 16, 2019, 1:02 PM IST

వికసించిన 'పద్మాలు'

రాష్ట్రపతి భవన్​లో పద్మ పురస్కారాల కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రఖ్యాత జానపద గాయని తేజాబా 'పద్మవిభూషణ్' పురస్కారం అందుకున్నారు.

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్, ప్రముఖ వ్యాపారవేత్త మహా ధర్మపాల్​ గులాటి, పర్వతారోహకురాలు బచేంద్రిపాల్​లు పద్మ భూషణ్​ పురస్కారాలను అందుకున్నారు.

'పద్మశ్రీ' పురస్కార గ్రహీతల్లో ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్​బాల్​ క్రీడాకారుడు సునీల్​ ఛత్రి, క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​, ఆర్చరీ క్రీడాకారిణి బొంబాల దేవి తదితరులు ఉన్నారు.

ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 112 మందికి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 11న జరిగిన కార్యక్రమంలో 47 మందికి పద్మ పురస్కారాలు అందించారు. మిగిలిన వారికి ఈ రోజు ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details