తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దులో మార్పు లేదు- ఉద్రిక్తంగానే పరిస్థితులు'

లద్దాఖ్​లో చైనా సరిహద్దు వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఘర్షణ ప్రాంతాల్లో సైనిక పరిస్థితిలో మార్పు లేదని వెల్లడించాయి. చైనా సైన్యంలో కదలికలు లేవని.. అయినప్పటికీ భారత్​ మాత్రం యుద్ధ సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశాయి.

Overall situation at friction points in eastern Ladakh unchanged Sources
'సరిహద్దులో మార్పు లేదు- ఉద్రిక్తంగానే పరిస్థితులు'

By

Published : Sep 15, 2020, 5:38 AM IST

తూర్పు లద్దాఖ్​లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక ప్రతిష్టంభనకు పరిష్కారం కోసం అయిదు రోజుల క్రితం భారత్, చైనా విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పటికీ.. సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి.

వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల సైన్యం తమతమ ప్రదేశాల్లో స్థిరంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా సైన్యంలో తాజాగా ఎలాంటి కదలికలు లేవని తెలిపాయి. అయినప్పటికీ భారత సైన్యం భద్రత ఏర్పాట్లను తగ్గించడం లేదని వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడేంత వరకు తూర్పు లద్దాఖ్​లో యుద్ధ సన్నద్ధతను సైన్యం కొనసాగిస్తుందని స్పష్టం చేశాయి.

ఇరుదేశాల మధ్య జరిగే కార్ప్స్​ కమాండర్ స్థాయి సైనిక సమావేశానికి సంబంధించిన తేదీలను ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరుదేశ విదేశాంగ మంత్రులు అంగీకరించిన ఐదు సూత్రాల నిబంధన అమలుపై సమావేశంలో చర్చించనున్నట్లు వివరించాయి.

ABOUT THE AUTHOR

...view details