దేశంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 5,865కి చేరింది. వైరస్ వ్యాప్తికి మహారాష్ట్ర కేంద్రంగా మారింది. ఒక్కరోజు వ్యవధిలో ఆ రాష్ట్రంలో 211మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య 1,346కి పెరిగింది. రాష్ట్రంలో 72మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో..
కర్ణాటక గడగ్ జిల్లాలో వైరస్ కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రంలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 197కు పెరిగింది.