తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 50 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు - latest business news

దేశంలో అంతర్జాలం ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగి 50 కోట్లు దాటినట్లు ఇంటర్​నెట్​ అండ్ మొబైల్​ అసోసియేషన్​ వెల్లడించింది. వీరిలో 14 శాతం మంది 5నుంచి 14ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులేనని పేర్కొంది.

over 500 million internet users in india
భారత్​లో 50 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు

By

Published : May 6, 2020, 6:14 AM IST

Updated : May 6, 2020, 6:56 AM IST

ఇంటర్నెట్​ అండ్ మొబైల్​ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో అంతర్జాలం వినియోగిస్తున్న వారి సంఖ్య 50 కోట్లు దాటినట్లు వెల్లడైంది. వీరిలో 14 శాతం అంటే దాదాపు ఏడు కోట్ల 10లక్షల మంది 5నుంచి 14ఏళ్ల వయసున్న పిల్లలే అని తెలిపింది. వీరంతా తమ కుటుంబ సభ్యుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని వెల్లడించింది.

ఐఏఎంఏఐ 'డిజిటల్ ఇన్​ ఇండియా' నివేదిక ప్రకారం భారత్​లో 50కోట్ల 40లక్షల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. కనీసం నెలలో ఓసారైనా వెబ్​లోకి లాగిన్​ అవతున్నారని 2019, నవంబర్ చివరి నాటి వివరాలు స్పష్టం చేస్తున్నాయి.​ నీల్సన్​, ఐఆర్​ఎస్ వివరాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడించింది ఐఏఎంఏఐ.

దాదాపు 70 శాతం మంది రోజూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వారానికి ఓసారి అంతర్జాలాన్ని వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్య 2019 మార్చి తర్వాత 3కోట్లు పెరిగింది.

సాధారణ రోజులతో పోల్చితే ఆదివారాలు, సెలవుల్లో సగటున గంటకుపైగా అంతర్జాలంలో గడుపుతున్నారు మూడింట ఒక వంతు వినియోగదారులు. వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందినవారే ఎక్కువ.

2019 నవంబర్​లో కొత్తగా 2కోట్ల 60లక్షల మంది మహిళలు ఇంటర్నెట్ వాడకాన్ని ప్రారంభించారు. పురుషుల్లో కొత్త వినియోగదారులతో పోల్చితే ఈ సంఖ్య 12శాతం అధికం. మొబైల్ ఫోన్ల ద్వారానే ఎక్కువ మంది అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గడం, డేటా ప్లాన్లు చౌకగా ఉండటం కారణంగా అంతర్జాల వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Last Updated : May 6, 2020, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details