తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3 కోట్ల మాస్క్​ల ఉచిత పంపిణీ: కేంద్రం

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు మార్చి 11 నుంచి ఇప్పటి వరకు 3.04 కోట్ల మాస్క్​లను అందజేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు 1.28 కోట్ల పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్​(హెచ్​సీక్యూ) మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపింది.

Over 3 Cr N95 masks, 1.28 Cr PPEs, 10 Cr HCQ tablets given to states, UTs by Centre for free

By

Published : Aug 13, 2020, 12:37 PM IST

దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున సహకారం అందించినట్లు కేంద్రం వెల్లడించింది. మార్చి 11 నుంచి ఇప్పటి వరకు 3.04 కోట్ల ఎన్​-95 మాస్క్​లను ఉచితంగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో పాటు 1.28 కోట్ల పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్​(హెచ్​సీక్యూ) మందులను అందించినట్లు పేర్కొంది.

పలు రాష్ట్రాలకు 22,533 స్వదేశీ వెంటిలేటర్లను కూడా పంపించినట్లు పేర్కొంది. ఈ యంత్రాల ఇన్​స్టాలేషన్ నుంచి ప్రారంభించటం వరకు కేంద్రమే పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఈ సంక్షోభ సమయంలో మహమ్మారిని నియంత్రించటానికి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను బలోపేతం చేయటం కోసం వైద్య మౌలిక సదుపాయాలను పెంపొందించటంలో కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది.

ఆత్మ నిర్భర్​ భారత్​, మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా స్వదేశీ సంస్థలకు పోత్సాహకాలను అందించటం ద్వారా ఎన్-95, వెంటీలేటర్లు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికాలను దేశీయంగా తయారు చేసి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:ఈ ఆరు చిట్కాలతో నిద్రలేమి సమస్య దూరం!

ABOUT THE AUTHOR

...view details