తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా టెస్టుల్లో కొత్త రికార్డ్- ఒక్కరోజే 2 లక్షలు - Coronavirus tests latest news

ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 2లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఈ పరీక్షల సామర్థ్యాన్ని త్వరలోనే మూడు లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Over 2 lakh COVID-19 tests done in last 24 hours, says ICMR
ఒక్కరోజులో 2 లక్షల కరోనా టెస్ట్​లు.. ఏపీ@3

By

Published : Jun 24, 2020, 6:02 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తిని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించి, బాధితులకు సమర్థమైన చికిత్స అందించడమే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.

మంగళవారం ఒక్కరోజే 2,15,195 మందిని పరీక్షించగా.. జూన్​ 23నాటికి దేశవ్యాప్తంగా 73,52,911 మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

3 లక్షలకు పెంచే దిశగా..

ఒక్కరోజు పరీక్షల సామర్థ్యాన్ని 3 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఇప్పటికే దేశంలో ప్రభుత్వ(730), ప్రైవేటు(270) రంగాల్లో మొత్తం 1000 ల్యాబ్​లకు అనుమతిచ్చినట్లు వెల్లడించింది. వైరస్​ పరీక్షలను అధిక సంఖ్యలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకూ సూచించింది ఐసీఎంఆర్​.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,56,183 మంది వైరస్​ బారిన పడగా... 14,176 మంది కరోనాతో మరణించారు.

ఇదీ చూడండి:మైనర్​కు 66 ఏళ్ల బాషా ప్రేమలేఖ- చివరకు...

ABOUT THE AUTHOR

...view details