మొబైల్ ఎన్ని సార్లు రిపేర్ చేయించినా సరిగ్గా పనిచేయడం లేదని కారణం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో కీలక విషయాన్ని గుర్తించారు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు. ఒక్క ఐఎంఈఐ నంబరుపై ఏకంగా 13వేల 500 ఫోన్లు వాడకంలో ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ ఫోన్ల తయారీ సంస్థపై కేసు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించారు.
ఇది తీవ్రమైన భద్రతా సమస్య అని, ఫోన్ల తయారీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా నేరస్థులకు ప్రయోజనం చేకూరుతుందని మేరఠ్ నగర ఎస్పీ అఖిలేశ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.