రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలైన ఆమ్ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, వామ పక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసేంతవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.
- ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు.. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయనీయకుండా మరో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- స్వామినాథన్ సిద్ధాంతాన్ని అనుసరించి కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని కోరారు.
- 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
గత రెండు రోజులుగా సభలో జరిగిన పరిణామాల పట్ల ఎవరూ సంతోషంగా లేరని నేను భావిస్తున్నాను. కోట్ల మంది ప్రజలకు ప్రాతినిథ్యం వహించేవారిని ప్రజలు చూస్తారు. వారి గళాన్ని వినిపించాలని కోరుకుంటారు. అధికార సభ్యులైనా, ప్రతిపక్ష సభ్యులైనా సభకు ఎందుకు వచ్చారో ఆ లక్ష్యం పూర్తి కావాలి. ఈ లక్ష్యం రెండు, మూడు నిమిషాల్లో పూర్తి కాదు.
- గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
ఈ మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ తెలిపారు.