పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు వేదికగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని కాపాడండి' అంటూ నినదించారు ఎంపీలు.
యువతలో నైపుణ్యాల అభివృద్ధిపై చర్చకు అవకాశమివ్వాలని.. ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. సభ సజావుగా సాగేలా చూస్తామని పార్టీ సభాపక్షనేతలు హామీ ఇచ్చినట్లు సభ్యులకు గుర్తు చేశారు బిర్లా.