దిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం వద్ద కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని తాజా పరిస్థితులపై అగ్రనేతలు చర్చించారు.
సోనియా గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరీ, డీ రాజా పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ భేటీకి హాజరయ్యారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతిచ్చి ఉద్యమాలను ముందుకు నడిపించాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.