ETV Bharat / bharat

విపక్షాల భేటీకి బీఎస్పీ, తృణమూల్​, ఆప్​ దూరం - BSP to skip meeting of oppn parties called by Cong

దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న విపక్షాల సమావేశానికి ఆమ్​ ఆద్మీ కూడా దూరం కానుంది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ జరగనుంది. అయితే.. ఈ సమావేశానికి బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా హాజరుకావట్లేదు.

meet
సీఏఏపై విపక్షాలు భేటికి 'మేము' దూరం
author img

By

Published : Jan 13, 2020, 12:11 PM IST

పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలో భేటీ కానున్నాయి. అయితే ఈ సమావేశానికి ఇప్పటికే దూరమైన తృణమూల్​, బీఎస్పీ జాబితాలో ఆప్​ కూడా చేరింది. భేటీ గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, అందుకే దూరంగా ఉంటున్నామని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

ప్రతిపక్షాల ఐక్యత చాటే ఉద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉండటం గమనార్హం.

దీదీ వివరణ..

ఇటీవల కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్ష కార్యకర్తల మధ్య ఉద్రిక్త ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలపై అసహనంగా ఉన్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల సమావేశానికి తాను హాజరుకావట్లేదని స్పష్టం చేశారు.

బీఎస్పీ స్పష్టం

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. గతేడాది సెప్టెంబరులో రాజస్థాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పొసగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరైతే అది రాజస్థాన్‌లోని పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తుందని మాయావతి ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'శబరిమల 'రివ్యూ' పిటిషన్లను విచారించట్లేదు'

ZCZC
PRI GEN NAT
.LUCKNOW DEL7
UP-MAYAWATI-CAA MEET
Mayawati to skip opposition meeting on CAA
         Lucknow Jan 13 (PTI) BSPPresident Mayawati on Monday said her party will not attend the Congress-led opposition meeting to discuss a strategy on protests over the CAA and NRC, saying it will "demoralise" her party workers
         In a series of tweets, the former Uttar Pradesh chief minister said her party is against the Citizenship Amendment Act (CAA) and the National Register of Citizens (NRC) but attending the meeting will demoralise BSP workers in Rajasthan, where the Congress has caused defections in her party.
         "As is well known that despite the BSP support to the Congress-led Rajasthan government from outside, it has been for the second time that BSP MLAs have been made to join their party which is completely wrong" Mayawati said in a tweet in Hindi.
         "Under such circumstances, the BSP attending the opposition meeting today under the leadership of the Congress will be demoralising forparty workers in Rajasthan. Therefore, the BSP will not attend this meeting," she said.
          However, she made it clear that the BSP is against the CAA and NRC
         "As it is, the BSP is against CAA/ NRC etc. It is an appeal to the central government again that it should withdraw this divisive and unconstitutional law. Also, It is very unfortunate to politicize students in JNU and other educational institutions" she added. PTI SAB

DV
DV
01131033
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.