తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​ ప్రజలను కలిసేందుకు వెళ్లిన విపక్షాల ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర సర్కారు వెనక్కి పంపడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ తప్పుబట్టారు. కశ్మీరీలపై సర్కారు నిరంకుశ వైఖరిని తామూ స్వయంగా అనుభవించామన్నారు.

'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'

By

Published : Aug 26, 2019, 6:01 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'

శ్రీనగర్ సందర్శనకు ప్రయత్నించిన సమయంలో సర్కారు నిరంకుశ, క్రూరమైన పాలనను విపక్షాలు, మీడియా రుచి చూశాయని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లోయలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు రాహుల్ సహా విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం శ్రీనగర్​కు వెళ్లింది. కానీ అధికారులు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు నేతలను అనుమతించకపోయిన కారణంగా... రాష్ట్రంలో పర్యటించకుండానే వెనుదిరిగారు.

రాహుల్ ట్వీట్

"జమ్ముకశ్మీర్ ప్రజల స్వాతంత్య్రాన్ని రద్దు చేసి 20 రోజులవుతుంది. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న నిరంకుశ పాలనను విపక్షనేతలు, మీడియా రుచిచూశారు."

- ట్విట్టర్​లో రాహుల్ గాంధీ

విపక్ష నేతలు శ్రీనగర్​ను వీడాలన్న ఆదేశాలను చదివి వినిపిస్తోన్న అధికారుల దృశ్యాలు, రాహుల్ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్​ చేశారు కాంగ్రెస్ నేత.

ఇదీ చూడండి: గంటలపాటు పాముకు శస్త్రచికిత్స... ప్రాణాలు సేఫ్

Last Updated : Sep 28, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details