భాజపా ఎన్నికల ప్రచార వ్యూహాలపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా తాజాగా మొదలు పెట్టిన 'నేనూ చౌకీదార్' ప్రచారంపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఛలోక్తులు విసిరారు.
"నేనూ కాపలదారున్నే ప్రచారాన్ని భాజపా మొదలు పెట్టాక మోదీతో ఆ పార్టీ నేతలంతా పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకున్నారు. నరేంద్రమోదీ ఇప్పటి నుంచి చౌకీదారే. గత ఎన్నికల్లో ఛాయ్‌వాలా ఇప్పుడు చౌకీదార్‌గా మారారు. భాజపా ప్రభుత్వంలో ఎంతమార్పు. అభినందించాల్సిన విషయం!"
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
బీఎస్పీ మిత్రపక్షం సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సైతం రఫేల్ విషయంలో భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. అభివృద్ధి ప్రశ్నిస్తోందంటూ మోదీకి చురకలంటించారు. వివిధ అంశాలపై వరుస ట్వీట్లలో మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.