తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చొరబాటు కుట్ర భగ్నం- ముష్కరుడు హతం - infiltration from pakistan

జమ్ముకశ్మీర్​లో నియంత్రణ రేఖ దాటి భారత్​లోకి చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రముఠాను అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

infiltration
ఉగ్ర చొరబాటు భగ్నం.. ముష్కరుడు హతం

By

Published : Aug 9, 2020, 4:36 PM IST

భారత్​లోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రమూకలను తరిమికొట్టాయి భద్రతా బలగాలు. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి చొరబాట్లకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుర్తించి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

" జిల్లాలోని కృష్ణా ఘాటి సెక్టార్​లో చొరబాట్లకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సిబ్బందిని అప్రమత్తం చేశాయి. వెంటనే స్పందించిన బలగాలు ఉగ్రవాదులను నిలువరించే చర్యలు చేపట్టాయి. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు అక్కడికక్కడే హతమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మరణించిన ఉగ్రవాది సహచరులు అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు తర్వాత తెలిసింది. ఒక ఏకే-47 రైఫిల్​, రెండు మ్యాగజైన్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం."

- లెఫ్టినెంట్​ కల్నల్​ దేవేందర్​ ఆనంద్​, సైన్యం అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: కశ్మీర్​ రంగస్థలంలో సరికొత్త 'రాజకీయం'!

ABOUT THE AUTHOR

...view details