రెండురోజులుగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 15 క్షణాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి జంతువు కళేబరాన్ని బైక్ వెనుక భాగానికి కట్టి రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. కొద్ది క్షణాలకు ఓ సింహం బైక్‌ను తరుముకుంటూ దర్శనమిచ్చింది. ఈ వీడియోను కొందరు యువకులు దూరం నుంచి తీశారు. ఈ ఘటన గుజరాత్లో జరిగింది.
సింహాన్నే పరిగెత్తించాడు- పోలీసులకు చిక్కాడు - వీడియో
గుజరాత్లో సింహంతో ఆటలాడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ జంతువు కళేబరాన్ని మోటార్ సైకిల్‌కు కట్టి సింహానికి ఎర చూపాడు ఈ వ్యక్తి. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఈ వీడియోను తీవ్రంగా పరిగణించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. నిందితుడ్ని పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను రెండు, మూడు రోజుల క్రితం అమ్రేలి జిల్లాలోని అడవిలో రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది ఆటలాడదామని చేశారా లేక చట్టవ్యతిరేకంగా ఏదైనా సింహాల షో ఏర్పాటు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. సింహాలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆసియా సింహాలకు గుజరాత్ ఓ ఆవాసం. గిర్ అటవీ సంరక్షణ కేంద్రంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో సుమారు 600 సింహాలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా.
- ఇదీ చూడండి: బోఫోర్స్ దర్యాప్తు కొనసాగుతుంది: సీబీఐ