జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మహరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలీసు చెక్‌పాయింట్ వద్ద గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దుర్ఘటనలో స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసు చెక్ పాయింట్ వద్ద రోడ్డు పక్కన గ్రెనేడ్ పేలినందున ఇద్దరు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే.. క్షతగాత్రులను స్థానిక ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించే క్రమంలో ఒకరు మృతి చెందారని మరొకరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.