తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంప్రదాయాల ప్రతిబింబం.. 'ఓనం' పండుగ ఆరంభం - నదులు

10 రోజులపాటు జరిగే కేరళ 'ఓనం' ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. భిన్న సంస్కృతులకు నిలయమైన ఈ పండుగ కేరళ సంప్రదాయాన్ని చాటుతుంది. డప్పు చప్పుళ్లు, కోలాటాల కోలాహలాలు, కథాకళి నాట్యాలు సహా వివిధ రకాల కళా ప్రదర్శనలతో ఓనం వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

సాంప్రదాయాల ప్రతిబింబం.. 'ఓనం' పండుగ ఆరంభం

By

Published : Sep 2, 2019, 6:12 PM IST

Updated : Sep 29, 2019, 4:50 AM IST

సంప్రదాయాల ప్రతిబింబం.. 'ఓనం' పండుగ ఆరంభం

పూల అలంకారాలు, ప్రత్యేక పూజలు, ఆడపిల్లల ఆటపాటలు, సంప్రదాయ కళల ప్రదర్శనలతో సాగే 'ఓనం' పండుగ కోలాహలం మొదలైంది.

ఓనం... వచ్చిందంటే వర్షాలతో కేరళ మురిసిపోతుంది. నదులు ఉప్పొంగుతుంటాయి. సరస్సులు నిండుకుండలవుతాయి. నదుల పాయల్లో.. కాలువల మలుపుల్లో, సరస్సుల్లో.. ముచ్చటగా ముస్తాబైన పడవలు కదులుతుంటాయి. పోటాపోటీగా దూసుకెళ్తుంటాయి. తమదైన సంస్కృతిని చాటి చెబుతుంటాయి.

భాద్రపద శుక్లపక్ష ద్వాదశి రోజు ఓనం పండుగను మలయాళీలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ద్వాదశికి పది రోజుల ముందే ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఆ ఉత్సవం నేడు ప్రారంభమైంది. ఓనం పండుగ ఆగమనాన్ని సూచించే ఈ ఉత్సవాన్ని 'అత్తచమయం' అని పిలుస్తారు.

'ప్రజల ఐకమత్యానికి ప్రతీక'...

రాష్ట్ర సాంస్కృతిక మంత్రి ఏకే బాలన్​ కొచ్చిలోని త్రిపునితురలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కుల, మత వర్గ భేదాలు లేని ప్రజల ఐకమత్యాన్ని ఓనం పండుగ చాటుతుందని తెలిపారు. ఈ ఏడాది ఓనం ఉత్సవాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

వరదలు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలకు ఓనం పండుగ శక్తినిస్తుందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. తెయ్యం, కోల్​కలి, మయిలీ ఆట్టం, అమ్మన్​కుడం, పులిక్కాలి సహా సంప్రదాయ నృత్యాలైన కథాకళి కళలతో ఈ ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. చెండామేళం, పంచవాద్యం వంటి సంప్రదాయ కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పూర్వం కొచ్చి మహారాజు త్రిపునితుర నుంచి త్రిక్కాకరలోని వామనమూర్తి ఆలయం వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారట. విష్ణువు అవతారమైన వామనమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పర్వదినాన్ని 1961లో కేరళ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

Last Updated : Sep 29, 2019, 4:50 AM IST

ABOUT THE AUTHOR

...view details