తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ సంప్రదించింది:ఒమర్ - ఓమర్​ అబ్దుల్లా

లోక్​సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్​ పార్టీ తమను  సంప్రదించిందని ​నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఒమర్​ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్​లోని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే పోటీలో ఉంటారని కాంగ్రెస్​కు స్పష్టంచేశారు.

నేషనల్​ కాన్ఫరన్స్​ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా

By

Published : Mar 17, 2019, 6:40 PM IST

జమ్ముకశ్మీర్​లో లోక్​సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్​ పార్టీ తమను సంప్రదించిందని నేషనల్​ కాన్ఫరన్స్​ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే, కశ్మీర్​లోని మూడు స్థానాల్లో నేషనల్​ కాన్ఫరెన్స్​ అభ్యర్థులే పోటీలో ఉంటారని కాంగ్రెస్​ నేతలకు స్పష్టం చేసినట్టు తెలిపారు.

నేషనల్​ కాన్ఫరన్స్​ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా

"పొత్తు కోసం కాంగ్రెస్​ నేతలు మమ్మల్ని సంప్రదించారు. పొత్తుకు అంగీకరించినప్పటికీ మేము ఒక ప్రతిపాదన చేశాం. కశ్మీర్ ​లోయలోని మూడు స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులే పోటీలో ఉంటారని స్పష్టంగా చెప్పాం. వారికి మా ప్రతిపాదన నచ్చినట్లైతే మిగతా సీట్ల గురించి చర్చిస్తాం. వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి" - ఓమర్​ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి.

ఒమర్​ అబ్దుల్లానే ముఖ్యమంత్రి

రాబోయే శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ఒమర్​ అబ్దుల్లానే ముఖ్యమంత్రి అవుతారని నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్​ అబ్దుల్లా స్పష్టం చేశారు. "ఒమర్​ యువకుడు, నేను వృద్ధుడిని. అతనిలా నేను పరిగెత్తలేను" అన్నారు ఫరూఖ్.

ABOUT THE AUTHOR

...view details