తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ స్పీకర్​ ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా.! - లోక్​సభ

లోక్​సభ స్పీకర్​ అభ్యర్థిగా భాజపా ఎంపీ ఓం బిర్లాను ఎన్డీఏ నిర్ణయించినట్టు సమాచారం. సభలో పూర్తి మెజార్టీ ఉన్నందున ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థి సులువుగా ఎన్నికవుతారు.

ఓం బిర్లా

By

Published : Jun 18, 2019, 10:24 AM IST

భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లాను లోక్​సభ స్పీకర్​ అభ్యర్థిగా అధికార ఎన్డీఏ ప్రకటించనుందని సమాచారం. రాజస్థాన్​లోని కోటా-బుండి లోక్​సభ స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.

ఎన్డీఏకి లోక్​సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నందున ఆ కూటమి ప్రతిపాదించే అభ్యర్థే సునాయసంగా గెలుపొందుతారు. ఒకవేళ వేరే పార్టీలు అభ్యర్థిని పోటీకి దింపితే ఎన్నిక బుధవారం జరుగుతుంది.

ఇదీ చూడండి :భాజపా తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా

ABOUT THE AUTHOR

...view details