తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​లో ఓటేసేందుకు సిద్ధమైన శతాధికుడు - హిమాచల్​ప్రదేశ్​

హిమాచల్​ప్రదేశ్​లో ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు 102 ఏళ్ల శ్యాం శరణ్​ నేగి. ఓటు ఆవశ్యకతను చాటి చెబుతున్నారు. శరణ్​ నేగిని పోలింగ్​ కేంద్రానికి తీసుకెళ్లి, ఓటు వేయించి మళ్లీ ఇంటికి తీసుకొచ్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని కిన్నౌర్​ జిల్లా కలెక్టర్​ తెలిపారు.

హిమాచల్​లో ఓటేసేందుకు సిద్ధమైన శతాధికుడు

By

Published : May 19, 2019, 8:23 AM IST

హిమాచల్​లో ఓటేసేందుకు సిద్ధమైన శతాధికుడు

ఆయన పేరు శ్యాం శరణ్​ నేగి. ఉండేది హిమాచల్​ ప్రదేశ్​లోని కిన్నౌర్​ జిల్లా కల్పా పట్టణంలో. మాజీ ఉపాధ్యాయుడైన శ్యాం ప్రస్తుత వయసు 102 ఏళ్లు. అయినా ఓటేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉత్సాహంగా చెబుతున్నారు. 1951 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారి ఓటు వేశారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు జరిగే సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్​లోనూ ఓటు వేయనున్నారు.

కేంద్రానికి తీసుకెళతాం

102 ఏళ్ల శ్యాం శరణ్​ నేగి ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు కిన్నౌర్​ జిల్లా కలెక్టర్​. ఆయనను గౌరవంగా పోలింగ్​ కేంద్రానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

ఇదీ చూడండి- WC 19: 1999 ప్రపంచకప్​- విశ్వవిజేతగా మరోసారి ఆసీస్

ABOUT THE AUTHOR

...view details