తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువకుని సెల్ఫీ క్రేజ్! - selfie

కర్ణాటకలో ఓ యువకుని సెల్ఫీ వృద్ధుడి ప్రాణం కాపాడింది. తుంగభద్ర నదిలో దూకబోయిన వృద్ధుడు యువకుడి సెల్ఫీ కెమెరాలో చిక్కాడు. దూరంగా ఉన్నా కేకలు వేసి జనాల సాయంతో అతన్ని కాపాడాడు ఆ యువకుడు.

వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువకుని సెల్ఫీ క్రేజ్!

By

Published : Aug 11, 2019, 5:49 PM IST

Updated : Sep 26, 2019, 4:16 PM IST

వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువకుని సెల్ఫీ క్రేజ్!
సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ అదే సెల్ఫీ మోజు కర్ణాటకలోని ఓ ముసలాయన ప్రాణం నిలిపింది.

కర్ణాటకలోని దావనగెరె జిల్లా హరిహర తాలుకాలో తుంగభద్ర నదీ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్నాడు ఆ యువకుడు. వరద ప్రవాహంతో మనోహరంగా కనిపించింది ఆ ప్రదేశం. ఆ ప్రకృతి అందాల నడుమ తన రూపాన్ని ఫోన్ కెమెరా​లో బంధించాలనుకున్నాడా యువకుడు. ఫోన్ తీసి కెమెరాతో సెల్ఫీలు మొదలు పెట్టాడు.

నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుకు అవతలి పక్క ఉన్న ఓ వృద్ధుడు కెమెరాలో కనిపించాడు. వెనక్కి తిరిగి చూశాడు నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. వెంటనే గట్టిగట్టిగా కేకలువేసి చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు వృద్ధుడిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు.

ఆ పెద్దాయన ఎవరు, ఎన్ని కష్టాల్లో ఉన్నాడో తెలీదుగానీ, క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోకుండా చేసిన సెల్ఫీ చిత్రానికి ఇప్పుడు లైక్స్​ క్యూ​ కట్టాయి.

ఇదీ చూడండి: 'ఒక్క సినిమాతోనే జీవితం సెటిలైపోయింది

Last Updated : Sep 26, 2019, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details