తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రసగుల్లా' పోరులో ఒడిశాదే గెలుపు - ప్రొటెక్సన్​

ఒడిశా ప్రజలు తమ ఆరాధ్య దైవం పూరీ జగన్నాథునికి ప్రీతి పాత్రంగా భావించే రసగుల్లాపై భౌగోళిక గుర్తింపు ఆ రాష్ట్రానికే దక్కింది. కొన్నేళ్లుగా రసగుల్లాపై బంగాల్​, ఒడిశా మధ్య వివాదం నడిచింది. ఎట్టకేలకు హక్కు ఒడిశాకే దక్కింది. ఈ పరిణామంపై ఒడిశా ముఖ్యమంత్రి   హర్షం వ్యక్తం చేశారు.

'రసగుల్లా' పోరులో ఒడిశాదే గెలుపు

By

Published : Jul 30, 2019, 12:10 PM IST

'రసగుల్లా' పోరులో ఒడిశాదే గెలుపు

ఒడిశా ప్రజలకు, పూరీ జగన్నాథునికి అత్యంత ప్రీతి పాత్రమైన రసగుల్లా మిఠాయిపై ఎట్టకేలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) ఒడిశాకే దక్కింది.

భౌగోళిక సూచిక వస్తువుల (రిజిస్ట్రేషన్​, ప్రొటెక్సన్​) చట్టం 1999 ప్రకారం ఈ మిఠాయికి 'ఒడిశా రసగుల్లా' గా గుర్తింపునిస్తున్నట్లు జీఐ రిజిస్ట్రేషన్​ సంస్థ చెన్నై కార్యాలయం సోమవారం ప్రకటించింది. 2028 ఫిబ్రవరి 22 వరకు గుర్తింపు చెల్లుబాటవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ పరిణామంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు.

"ఒడిశా రసగుల్లా భౌగోళిక సూచిక రిజిస్ట్రీ (జీఐ ట్యాగ్​) గుర్తింపు పొందినందుకు సంతోషంగా ఉంది. ఎవరికైనా నోరూరించే ఈ మిఠాయికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి పరమాత్ముడు జగన్నాథునికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రసాదంగా దీనిని నివేదిస్తున్నారు."

- నవీన్​ పట్నాయక్​, ఒడిశా ముఖ్యమంత్రి

'రసగుల్లా' పోరులో ఒడిశాదే గెలుపు

బంగాల్​ X ఒడిశా...

2015 నుంచి ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల మధ్య రసగుల్లా తమదంటే తమదంటూ వివాదం నడుస్తోంది. 2017లో 'బంగ్లార్​ రసగుల్లా' గా భౌగోళిక గుర్తింపు పొందింది. ఈ విషయంపై ఒడిశా ప్రభుత్వం పట్టు బిగించి తాజాగా తమ రాష్ట్ర మిఠాయిగా గుర్తింపు సాధించింది.

చరిత్ర ఏం చెబుతోంది

ప్రాచీన గ్రంథాల్లో రసగుల్లా పూరీ జగన్నాథునికి ప్రీతిపాత్రమైనదిగా చెప్పారు. 15వ శతాబ్దం నాటి 'దండి రామాయణం'లో ఈ ప్రస్థావన వచ్చింది.

నీలాద్రి జీజే ఆచారాల ప్రకారం జగన్నాథుని తరఫున రసగుల్లా ప్రసాదాన్ని సంప్రదాయంలో భాగంగా లక్ష్మీ దేవికి అర్పిస్తారు.

లెజండరీ రచయిత ఫకీర్ మోహన్ సేనాపతి ఉత్కల్ భ్రమణంలో 'రసగుల్లా' గురించి రాశారు, ఇది 1892 ఆగస్టులో ప్రచురితమైంది.

పురాతన ఒడియా సాహిత్యంలో 'రసగుల్లా'గురించి ప్రస్తావించారని పేర్కొంటూ ప్రముఖ పరిశోధకుడు అసిత్​ మొహంతి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 500 ఎళ్లకు పైగా ఈ మిఠాయి రుచిని రాష్ట్ర ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు.

ఇదీ చూడండి:16 కిలోల పసిడితో 'గోల్డెన్​ బాబా' కావడి యాత్ర

ABOUT THE AUTHOR

...view details