కేంద్రమంత్రి పదవిని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఒడిశా బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రమైన ఒడిశాలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
"ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా బాధ్యత కూడా పెరిగింది. మంత్రి హోదాలో పూర్తి సామర్థ్యంతో పని చేస్తాను. ఒడిశా ప్రజలకు నేను చెప్పేది ఒకటే. ఎన్నికలు ముగిశాయి. రాజకీయాలకు అతీతంగా ముందుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి. అవినీతి అంతమై నవనిర్మాణం జరగాలి. ప్రకృతి వనరులను వాడుకుంటూ వృద్ధి సాధించేందుకు పాటు పడాలి."