తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం రోడ్లపై ప్రయాణానికి పడవలే దిక్కు - వరద బీభత్సం

ఎడతెరపి లేని వర్షాలతో అసోం అతలాకుతలమైంది. వరదల బీభత్సానికి ధుబ్రీలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వేరే దిక్కు లేక అక్కడివారు పడవల్లో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

అసోం: వరదలతో రోడ్లపై పడవ ప్రయాణం

By

Published : Jul 17, 2019, 3:38 PM IST

అసోం: వరదలతో రోడ్లపై పడవ ప్రయాణం

అసోంలో వరద బీభత్సానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరుణుడి ప్రకోపానికి ఊర్లకు ఊర్లు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోగా... లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

భారీ వర్షాల కారణంగా ధుబ్రీ జిల్లా కేంద్రం పూర్తిగా జలదిగ్భందమైంది. రోడ్లన్నీ నీటమునిగాయి. అక్కడి వారు వేరే దిక్కు లేక ఇతర ప్రాంతాలకు పడవల్లో ప్రయాణిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details