సరిహద్దు విభేదాలు వివాదాలుగా మారకుండా భారత్-చైనా కృషి చేయాలని... భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఓ అంగీకారానికి వచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశమైన ఇరువురు నేతలు.. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు.
"ఇరువురు నేతలు వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన సహా సరిహద్దుల్లో శాశ్వత యథాపూర్వ స్థితి పునరుద్ధరణే లక్ష్యంగా చర్చలు జరిపారు. అలాగే భవిష్యత్లో గల్వాన్ ఘర్షణ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సరిహద్దుల నుంచి సైనిక బలగాలను దశలవారీగా.. పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరువురు ఓ అంగీకారానికి వచ్చారు."
- అధికార వర్గాలు
భారత్-చైనా రెండూ వాస్తవాధీన రేఖను గౌరవించాలని... ఏ ఒక్కరూ వాస్తవాధీన రేఖ వెంబడి యథాపూర్వ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయకూడదని అజిత్ ఢోబాల్- వాంగ్ యీ నిశ్చయించారు.
కొద్ది గంటల్లోనే చైనా రివర్స్ గేర్