తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మ ఆరోగ్యం కోసం ఐదు రోజులు ఆసుపత్రుల చుట్టూ..!

భరించలేని నొప్పితో బాధపడుతున్న తల్లికి వైద్యం చేయించేందుకు ఐదురోజుల పాటు నోయిడాలోని ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు ఓ ఇంటర్​ విద్యార్థి. రోజుకో ఆసుపత్రికి వెళ్లిన తల్లీకుమారులను.. వసతులు లేవని తిప్పిపంపారు. చివరికి ప్రభుత్వాసుపత్రిలో చేరేందుకు 108​కు ఫోన్​ చేస్తే అర్థరాత్రి వరకు అంబులెన్స్​ రాలేదు.

Noida: Woman with kidney stone admitted to GIMS after shuttling between hospitals for 5 days
అమ్మ ఆరోగ్య కోసం ఐదు రోజులు ఆసుపత్రుల చుట్టూ..!

By

Published : Jun 8, 2020, 5:46 PM IST

ఆ మహానగరంలో వందల కొద్ది ఆసుపత్రులున్నాయి. కానీ ఏం లాభం? వసతులు మాత్రం అంతంత మాత్రమే. అందుకే.. వైద్యం కోరి వచ్చిన ఓ తల్లిని ముప్పతిప్పలు పెట్టాయి. అమ్మను దక్కించుకునేందుకు తల్లడిల్లిన ఇంటర్​ విద్యార్థిని ఐదు రోజుల పాటు నానా తంటాలు పడేలా చేశాయి.

ఐదు రోజుల వ్యథ..

ఉత్తర్​ప్రదేశ్ నోయిడా సెక్టార్​ 51లోని హోషియార్​పుర్​కు చెందిన ధీరజ్​ కుమార్​ ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్​ తల్లి శకుంతల దేవీకి కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. దానికి తోడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మొదలయ్యాయి. ధీరజ్​ సోదరిలిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. సెక్యూరిటి గార్డ్​గా పనిచేసే తండ్రికి గాయమై ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో.. ​బాధ్యత తీసుకుని తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు 18ఏళ్ల ధీరజ్. ఐదు రోజుల పాటు వేర్వేరు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు కానీ, ఎక్కడా అమ్మకు వైద్యం అందలేదు.

ఏం చేయాలో తెలియక గౌతంబుద్ధ నగర్​ మేజిస్ట్రేట్ సుహాస్​తో మాట్లాడాడు ధీరజ్​. దీంతో ప్రధాన వైద్యాధికారి దీపక్​ ఓహ్రితో మాట్లాడి ధీరజ్​ తల్లికి సాయం చేస్తానని మాటిచ్చారు సుహాస్​. కానీ, ఐదో రోజు అంబులెన్స్​ కోసం ఎదురు చూసి, అలసిపోయి ఫోన్​ చేస్తే మేజిస్ట్రేట్​ స్పందించలేదు. చేసేదేమీ లేక అర్థరాత్రి 1గంటకు అమ్మను నోయిడా జీఐఎమ్​ఎస్​కు పంపారు.

"మేము ముందుగా ఈఎస్​ఐ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ మాకు ఏవో మందులిచ్చి పంపేశారు. అమ్మకు నొప్పి తగ్గకపోయేసరికి మరుసటి రోజు.. మళ్లీ ఆసుపత్రికి వెళ్లాం. కానీ, వారు మమ్మల్ని కొవిడ్​-పరీక్ష చేయించుకొమ్మన్నారు. ఆ తర్వాతి రోజు, మేము సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా ఆసుపత్రికి వచ్చాం. అక్కడ బెడ్​ ఖాళీగా లేదని మమ్మల్ని జీఐఎమ్​ఎస్​కు పంపిచారు. సాయంత్రానికి జిల్లా ఆసుపత్రిలో ఓ బెడ్ ​ దొరికింది. కానీ, అక్కడి సిబ్బంది వసతులు లేవని బయటకు పంపించారు. చేసేదేమీ లేక 108కు ఫోన్​ చేశాం. అంబులెన్స్​ కోసం గంటల తరబడి ఎదురుచూశాం. తర్వాత అర్థరాత్రి ఒంటిగంటకు మేము జీఐఎమ్​ఎస్​లో చేరాం."

-ధీరజ్​ కుమార్​, బాధితుడు

ప్రస్తుతం శకుంతలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.

ఇది తొలిసారి కాదు..

నోయిడాలో ఇలాంటి ఘటన తొలిసారి కాదు. రెండు రోజుల క్రితమే ఎనిమిది ఆసుపత్రులు తిరిగిన గర్భిణి.. చివరికి అలసిపోయి మృత్యు ఒడికి చేరుకుంది. కనీస వసతులు లేని ఆసుపత్రుల నిర్లక్ష్య ధోరణి వల్ల.. బెడ్​ కోసం 13 గంటలపాటు తిరిగి .. ఆఖరికి నొప్పిని భరించలేక అంబులెన్స్​లో ప్రాణం విడిచింది ఆమె. గ్రేటర్ నోయిడాలో వసతులు లేని ఆసుపత్రుల చుట్టూ తిరిగి మే 25న ఓ చిన్నారి కన్ను మూసింది. ఇప్పుడు ధీరజ్​, శకుంతలు నానా తంటాలు పడ్డారు.

ఇదీచదవండి:రామమందిర నిర్మాణం ప్రారంభం ఆ రోజే!

ABOUT THE AUTHOR

...view details