తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ అమలు చేయకుండా ఆపడం అసాధ్యం' - పౌరసత్వంపై కపిల్ సిబల్

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పౌరసత్వ చట్టంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయకుండా ఉండడానికి ఆస్కారం లేదని వ్యాఖ్యానించారు. అమలు చేయకుండా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.

No state can deny implementation of CAA: Congress leader Kapil Sibal
సీఏఏ అమలు చేయకుండా ఉండటం అసాధ్యం: కపిల్ సిబల్

By

Published : Jan 18, 2020, 9:16 PM IST

Updated : Jan 19, 2020, 5:17 AM IST

పౌరసత్వ చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్ సిబల్‌ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయకుండా ఉండడానికి ఆస్కారం లేదని కేరళలోని కోజీకోడ్‌లో తెలిపారు.

ఒక వేళ అమలు చేయలేకపోతే అది రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేశారు. అమలు చేయకుండా ఉండడం అసాధ్యం అని వివరించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడం, శాసనసభలో తీర్మానాలు చేయడం, వద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం వంటివి చేసుకోవచ్చని, కానీ అమలుచేయబోమని చెబితే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందన్నారు.

కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత

"సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పై అన్ని రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ సందేశంకేంద్రానికి చేరింది. ఈ విషయం వారు వినే ఉంటారు. మరోవైపు... ఎన్​ఆర్​సీ ఎన్​పీఆర్​పై ఆధారపడి ఉంటుంది. ఎన్​పీఆర్​ని అమలు చేసేది​ లోకల్ రిజిస్ట్రార్​. లోకల్ రిజిస్ట్రార్​లు అమలు చేసే స్థానిక అధికారులై ఉండాలి. కాబట్టి వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. ఈ రిజిస్ట్రార్​లను కేంద్రానికి సహాకరించకుండా చేస్తామని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. నిజానికి ఇది సాధ్యమవుతుందో లేదో తెలియదు. కానీ రాజ్యాంగ బద్దంగా చూసుకుంటే.. పార్లమెంట్​ ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయబోమని చెప్పడం రాష్ట్రాలకు కష్టమే."-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత

దేశ భవిష్యత్తు కోసమే

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న నిరసనలు నాయకత్వానికి, భారత ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు కపిల్. నిరసనల్లో విద్యార్థులు, పేద, మధ్యతరగతి ప్రజలు పాల్గొంటున్నారన్నారు. వారు ఏ పార్టీకీ చెందినవారు కాదని.. దేశ భవిష్యత్తుపై వారు ఆందోళ వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దేశాభివృద్ధిని మరచి తన సొంత లాభం కోసమే పాటుపడుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: 'బైక్​ ఎక్కమన్నాడు.. నాకు భయమేసింది'

Last Updated : Jan 19, 2020, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details