తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజీనామాపై వెనక్కి తగ్గం- పరీక్షకు హాజరుకాం'

సుప్రీం కోర్టు తీర్పును కర్ణాటక తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్వాగతించారు. రాజీనామాల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బలపరీక్ష కోసం విధానసభకు హోజరుకాబోమని తేల్చిచెప్పారు. మరోవైపు రాజ్యాంగబద్ధంగానే రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్​ తెలిపారు.

'రాజీనామాపై వెనక్కి తగ్గం- పరీక్షకు హాజరుకాం'

By

Published : Jul 17, 2019, 3:01 PM IST

రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. రాజీనామాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు రెబల్​ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ మేరకు 15 మంది రెబెల్స్ తరఫున కాంగ్రెస్ రెబెల్​ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు.

"మేమంతా ఐక్యంగా ఉన్నాం. మేము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రశ్నే లేదు." - రెబల్​ ఎమ్మెల్యేలు

రేపు బలపరీక్షను ఎదుర్కోబోతున్న సంకీర్ణ సర్కారుకు సుప్రీం తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ ముంబయిలోని ఓ హోటల్​లో ఉంటున్నారు.

స్వాగతించిన స్పీకర్...

సుప్రీం తీర్పుపై కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ స్పందించారు. రాజీనామాలపై రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు. సుప్రీం తీర్పు తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details