కశ్మీర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా నాయకుడు అయమాన్ అల్ జవహిరి చేసిన బెదిరింపులు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కపాడుకునే శక్తి సామర్థ్యాలు భారత బలగాలకు ఉన్నాయని పేర్కొంది.
కశ్మీర్‌పై ఇలాంటి బెదిరింపులు కొత్తేంకాదని పేర్కొన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్.
"ఇలాంటి బెదిరింపులు వింటూనే ఉన్నాం. బెదిరిపులు రావటం ఇదే మొదటిసారి కాదు. దానిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఆల్‌ఖైదా అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించిన తీవ్రవాద సంస్థ. దాని నాయకుడు ఐరాస నిర్దేశిత ఉగ్రవాది. మన భద్రత బలగాలు తగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులకు బయపడాల్సిన పనిలేదు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని రక్షించే సామర్థ్యం వాటికి (సైన్యానికి) ఉంది."