తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిత్యావసరాల కోసం ఎవరూ భయపడొద్దు'

21రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలు భయపడొద్దని భరోసా కల్పించారు ప్రధాని నరేంద్రమోదీ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

No need for panic buying; essential commodities, medicines will remain available: PM
'నిత్యావసరాల కోసం ఎవరూ భయపడొద్దు'

By

Published : Mar 24, 2020, 11:49 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ తరుణంలో నిత్యావసరాల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

"దేశ ప్రజలారా లాక్​డౌన్​ విషయంలో మీరు భయపడవద్దు. నిత్యావసర వస్తువులు, మందులు అన్ని అందుబాటులో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తాయి. కరోనాపై అందరం కలిసి పోరాటం చేసి ఆరోగ్యవంతమైన భారత్​ను సృష్టించుకుందాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్​లోనే పెళ్లి

ABOUT THE AUTHOR

...view details