కరోనా రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆక్సిజన్ సరఫరాలో లోపాలు, కొరత లేకుండా చూడాలని కోరారు.
ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు: కేంద్రం - ఆక్సిజన్ సరఫరా
ఆక్సిజన్ సరఫరాలో లోపాలు, కొరత లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. ఆక్సిజన్ సరఫరాపై ఎలాంటి ఆంక్షలు ఉండరాదని స్పష్టం చేశారు.
ఆక్సిజన్ సరఫరా
ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే అంశంలో ఆంక్షలు ఉండరాదని, వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాల్లో స్థానికంగా సరఫరా చేసేందుకు అన్ని అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఆక్సిజన్ సరఫరా సంస్థలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రాల మధ్య సరఫరాలో కూడా ఆంక్షలు వర్తించవన్నారు. పలు నగరాల మధ్య జరిగే ఆక్సిజన్ సరఫరాలో కూడా ఎలాంటి కాలపరిమితిలేదని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:భారత్లో మరో టీకా అభివృద్ధి.. త్వరలోనే ట్రయల్స్!