తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ట్రిపుల్​ తలాఖ్​ కేసుల్లో ముందస్తు బెయిల్​ జారీ చేయొచ్చు'

ముమ్మారు తలాఖ్​ కేసుల్లో ముందస్తు బెయిల్​ మంజూరు చేయొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. 2019 చట్టంలోని బెయిల్​ నిషేధ నిబంధనలు తలాఖ్​ చెప్పిన భర్తకు మాత్రమే వర్తిస్తాయని, బాధితురాలి అత్తకు వర్తించవని పేర్కొంది. అయితే.. బెయిలిచ్చే ముందు బాధితురాలి వాదన వినాలని స్పష్టం చేసింది.

supreme court
సుప్రీం కోర్టు

By

Published : Jan 3, 2021, 8:00 AM IST

ట్రిపుల్​ తలాఖ్​ కేసులో ముందస్తు బెయిల్​ జారీ చేయొచ్చని, ఇందుకు ఎటువంటి అడ్డంకులు లేవని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే బెయిలిచ్చే ముందు బాధితురాలి వాదన వినాలని న్యాయమూర్తి జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ట్రిపుల్​ తలాఖ్​ క్రిమినల్​ నేరం. మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్ట ప్రకారం ముందస్తు బెయిల్​పై నిషేధం ముస్లిం భర్తలకే వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. బెయిల్​కు సంబంధించి చట్టంలోని వివిధ సెక్షన్లను, నేరశిక్షాస్మృతిలో నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు.. కోడల్ని వేధిస్తున్న మహిళకు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

గతేడాది ఆగస్టు నెలలో తన భర్త ట్రిపుల్​ తలాఖ్​ ఇచ్చారంటూ ఓ మహిళ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. ఇందులో నిందితురాలిగా ఉన్న అత్తకు బెయిలివ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. అయితే 2019 చట్టంలోని బెయిల్​ నిషేధ నిబంధనలు ట్రిపుల్​ తలాఖ్​ ఇచ్చిన ముస్లిం భర్తకు మాత్రమే వర్తిస్తాయని బాధితురాలి అత్తకు వర్తించవని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చూడండి:కార్యాలయాల్లో కునుకుతీస్తే ఇక వేటే!

ABOUT THE AUTHOR

...view details