బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ వచ్చే వారంలో ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సోమవారమే ఈ వేడుక ఉంటుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా నితీశ్ బాధ్యతలు చేపడతారని పేర్కొన్నాయి.
అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు జేడీయూ. మరోవైపు తమకు కూడా ఎలాంటి సమాచారం అందలేదని బిహార్ రాజ్‌భవన్ వెల్లడించింది.