నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలనలో వరిధాన్యం, గోధుమలకు తప్ప మరే ఇతర పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని విమర్శించారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాతే మిగతా పంటలకు కూడా మద్దతు ధర కల్పించామన్నారు.
'మద్దతు ధరపై కాంగ్రెస్ ఆరోపణలు అర్థరహితం' - రైతుకు కనీస మద్దతు ధర
నూతన వ్యవసాయ చట్టాల పై కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ప్రతిపక్షం వీటిపై అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ మండిపడ్డారు.
'కనీస మద్దతు ధర కొనసాగుతుంది-కాంగ్రెస్ ఆరోపణలు అర్థరహితం'
వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అనవసర భయాలు కల్పిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై వస్తున్న వార్తలను ఖండిచారు. కనీస మద్దతు ధరను రద్దు చేస్తారన్న వార్తలపై వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రి అలాంటి ఊహాగానాలు చేయడం అర్థ రహితం అని అన్నారు. గతంలో ఉన్న విధంగానే ఎంఎస్పీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'రైతులను అంతం చేయడానికే వ్యవసాయ చట్టాలు'