దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాను విడుదల చేసింది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్). మానవ వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ దిల్లీ తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
యూనివర్సిటీల వారీగా..
వార్షిక ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐఎస్సీ బెంగళూరు, జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బిజినెస్ స్కూల్స్..
- ఐఐఎం- అహ్మదాబాద్
- ఐఐఎం- బెంగళూరు
- ఐఐఎం- కలకత్తా
కళాశాలల విభాగంలో
మిరండా కాలేజీ టాప్ ర్యాంక్ సాధించిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ప్రకటించారు. తర్వాతి స్థానాల్లో లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్, సెయింట్ స్టీఫెన్ కాలేజీ ఉన్నాయన్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో..
- ఐఐటీ- మద్రాస్
- ఐఐటీ- దిల్లీ
- ఐఐటీ- బాంబే
ఫార్మా విద్యాసంస్థల్లో..
- జామియా హమ్దర్ద్- దిల్లీ
- పంజాబ్ విశ్వవిద్యాలయం- చంఢీగఢ్
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్- మొహాలీ
వైద్య కళాశాలలు..
- ఎయిమ్స్- దిల్లీ
- పీజీఐ- చంఢీగఢ్
- సీఎంసీ- వెల్లూరు
విద్యాసంస్థల వార్షిక ర్యాంకింగ్‌లను ఏటా ఏప్రిల్‌లో ప్రకటిస్తారు. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకు వాయిదా పడింది.
ఇదీ చూడండి:అత్యుత్తమ విద్యాలయాల జాబితాలో భారత్‌కు చోటు