నిర్భయ కేసులో దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వార్తలతో నలుగురు దోషులు మానసికంగా ఒత్తిడికి లోనయినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు. ఒత్తిడిలో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కో దోషికి 4-5 మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
2012లో నిర్భయపై దుశ్చర్యకు పాల్పడిన ఆరుగురిలో ఒకడైన రామ్‌సింగ్ 2013లో తిహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు మైనర్ కావటం వల్ల మూడేళ్ల శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురిలో అక్షయ్, ముకేశ్, పవన్ గుప్తాలు ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.
రామ్‌సింగ్ ఆత్మహత్య అనంతరం దోషులపై నిఘా పెంచారు అధికారులు. ప్రస్తుతం ఉరి వార్తలతో మరింత ఒత్తిడికి లోనైన కారణంగా నిఘా పెంచారు. మానసికంగా కుంగిపోయిన నలుగురు భోజనం కూడా సరిగా చేయటం లేదని జైలు వర్గాలు తెలిపాయి.