కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతాలలో, మత ప్రదేశాల్లో మహిళలపై ఉన్న వివక్షకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ఇవాళ క్రోడీకరించనుంది.
తొమ్మిది మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనున్న అంశాలు:
- శబరిమల అయ్యప్ప ఆలయంలో యుక్తవయస్సు మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
- మసీదుల్లోకి ముస్లిం మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
- దావూది బోహ్రా ముస్లింల్లో మహిళలకు సున్తీ చేయించడం.
- ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ స్త్రీలకు పవిత్ర అగియారీలో ప్రవేశించకుండా నిషేధించడం.
రాజ్యాంగ ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో సహా జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎమ్ఎమ్ సంతానగౌండర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.