ఐసిస్ మాడ్యుల్‌కు సంబంధించి తమిళనాడులో ని తంజావూర్, తిరుచిరాపల్లి ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది.ఆరు మొబైల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులు, పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్, మెమొరికార్డు, సీడీలు, డీవీడీలు, ఒక గొడ్డలి సహా పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎర్నాకుళంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అప్పగించనున్నట్లు తెలిపారు.
తమిళనాడులో ఐసిస్ కార్యకలాపాలు.. ఎన్ఐఏ సోదాలు - nia searches
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రసంస్థకు సంబంధించి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. పలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఎన్ఐఏ సోదాలు
గత జూన్‌లో కోయంబత్తూరులో నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: మోదీ 2.0 ప్రభుత్వానికి ఆరు నెలలు.. ప్రధాని ట్వీట్