తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఐఏ విచారణకు కశ్మీరీ వేర్పాటువాదులు - జమాత్​ ఉద్​ దావా

కశ్మీరీ వేర్పాటువాదులు ముగ్గురిని 10 రోజులు ఎన్ఐఏ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రత్యేక కోర్టు. జమాత్​ ఉద్​ దావా ముఖ్యనేత హఫీజ్ సయీద్​కు ఆర్థిక సహాయం అందించారన్న అభియోగాలపై వీరిని ఎన్​ఐఏ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

10 రోజుల ఎన్​ఐఏ కస్టడీకి కశ్మీరీ వేర్పాటువాదులు

By

Published : Jun 4, 2019, 4:51 PM IST

2008 ముంబై దాడి సూత్రధారి, జమాత్​ ఉద్​ దావా ముఖ్యనేత హఫీజ్​ సయీద్​కు నిధులందించారన్న అభియోగంతో ముగ్గురు వేర్పాటువాదులను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. వీరిని దిల్లీ పటియాలా కోర్టులో హాజరుపరిచారు.

నిందితులు మస్రత్ ఆలం, ఆసియా అంద్రబీ, షబ్బీర్ షాలను 10 రోజుల ఎన్​ఐఏ కస్టడీకి అప్పగించారు ప్రత్యేక న్యాయమూర్తి రాకేశ్ శ్యాల్.

ఆసియా, షబ్బీర్​ వేర్వేరు కేసుల్లో కస్టడీలో ఉండగా మస్రత్​ ఆలంను జమ్ము కశ్మీర్ పోలీసుల ​నుంచి రిమాండ్ బదలాయించి తీసుకువచ్చారు.

హఫీజ్​ సయీద్, సయ్యద్ సలాఉద్దీన్ సహా మరో 10మంది కశ్మీరీ వేర్పాటువాదులపై 2018లో ఉగ్రసంస్థలకు నిధుల మళ్లింపు అభియోగంతో ఛార్జీషీటు దాఖలు చేశారు.

ఇదీ చూడండి: 'ఎస్పీ-బీఎస్పీ మధ్య దూరం శాశ్వతం కాదు'

ABOUT THE AUTHOR

...view details