గతేడాది దిల్లీలో వరుస పేలుళ్లకు కుట్రపన్నిన వారిలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). అనుమానితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమోరాకు చెందిన మహమ్మద్ గుర్ఫాన్‌గా గుర్తించింది.ఈ కేసులో ఇప్పటికే 12మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది ఎన్ఐఏ.
దిల్లీ పేలుళ్ల కుట్ర కేసులో సూత్రధారి అరెస్టు - isis
దిల్లీలో వరుస పేలుళ్లకు కుట్రపన్నిన మరో ఉగ్రవాదిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. గతేడాదిలో దిల్లీలో పేలుళ్లకు కుట్ర చేసింది ఉగ్రసంస్థ 'హర్కత్ ఉల్ హర్బ్ ఏ ఇస్లాం'. ఇప్పటికే 12మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ తాజాగా మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది.
దిల్లీ పేలుళ్ల కుట్ర కేసులో కీలక సూత్రధారి అరెస్టు
దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో పేలుళ్లకు ఐసిస్ ప్రేరేపిత ఉగ్రసంస్థ 'హర్కత్ ఉల్ హర్బ్ ఏ ఇస్లాం' ప్రణాళికలు రచించింది. ఈ కుట్ర కీలక సూత్రధారుల్లో గుర్ఫాన్ ఒకడని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. గుర్ఫాన్‌ను దిల్లీ కోర్టులో నేడు ప్రవేశపెట్టనుంది.
నిందితుల నుంచి భారీ మొత్తంలో పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. వీటిలో రాకెట్ లాంచర్లు, అలారం గడియారాలు, 25 కిలోల పేలుడు పదార్థాలు, 91 మొబైల్ ఫోన్లు, 134 సిమ్ కార్డులు, మూడు లాప్‌టాప్‌లు ఉన్నాయి.
Last Updated : Apr 21, 2019, 8:45 AM IST