పార్లమెంట్ తదుపరి సెషన్.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. అయితే.. ఇది క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలు అప్పటి నుంచేనా? - వెంకయ్యనాయుడు
క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. పార్లమెంట్ తదుపరి సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. అయితే.. షెడ్యూల్ ప్రకారంగానే జరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
పార్లమెంటు సమావేశాలు అప్పటి నుంచేనా?
మిషన్ కనెక్ట్‌లో భాగంగా.. రాజకీయ నేతలు సహా పార్లమెంటు సభ్యులు, మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు వెంకయ్య.
ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీలతో ఇవాళ సంభాషించిన వెంకయ్య పై వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.