టీవీ ఛానళ్లు జమ్ముకశ్మీర్ ప్రజలకు సందేశ మాధ్యమాలుగా అవతరించాయి. ఆ రాష్ట్రంలో ల్యాండ్‌లైన్ ఫోన్లు, మొబైల్స్, ఇంటర్నెట్ సదుపాయాల నిలిపివేతతో.. ఇతర ప్రాంతాల్లో నివసించే కశ్మీరీలు తమ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకుంటున్నారు. దేశ నలుమూలలు, ఇతర దేశాల నుంచి ఛానళ్ల ద్వారా తమ శ్రేయోభిలాషులకు సందేశాన్ని చేరవేస్తున్నారు.
లోకల్ కేబుల్ ఛానల్, ప్రాంతీయ, జాతీయ టీవీ ఛానళ్లకు సందేశాలు వెల్లువెత్తాయని ఓ ప్రైవేటు ఛానల్ ప్రతినిధి తెలిపారు. కశ్మీర్ ప్రభుత్వం 300 ప్రజా టెలిఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాక ఈ సందేశాల ప్రవాహం తగ్గిందని చెప్పారు.
కొంత మంది తమ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునేందుకు, మరికొంత మంది తాము క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిపేందుకు సందేశాలు పంపేవారని ప్రైవేటు ఛానల్ ప్రతినిధి చెప్పారు.
టీవీ ఛానళ్లకు పంపిన కొన్ని సందేశాలు