తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాగుబోతు ఆటోవాలాకు రూ.48వేలు ఫైన్​ - Auto Driver

కొత్తగా అమల్లోకి వచ్చిన మోటార్​ వాహనాల చట్టంతో భువనేశ్వర్​లోని ఓ ఆటోడ్రైవర్​కు భారీ జరిమానా పడింది. మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఏకంగా రూ.47,500 జరిమానా విధించారు ఆర్టీఓ అధికారులు.

తాగుబోతు ఆటోవాలాకు రూ.48వేలు ఫైన్​

By

Published : Sep 4, 2019, 6:48 PM IST

Updated : Sep 29, 2019, 10:50 AM IST

తాగుబోతు ఆటోవాలాకు రూ.48వేలు ఫైన్​

మోటార్​ వాహనాల చట్టం-2019 అమలుతో దేశవ్యాప్తంగా ఎంతో మంది డ్రైవర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా భువనేశ్వర్​లోని ఓ ఆటోడ్రైవర్​కు షాకిచ్చారు రవాణా శాఖ అధికారులు. మద్యం సేవించి వాహనాన్ని నడిపినందుకు హరిబంద్​ కన్హర్​ అనే వ్యక్తికి.. ఏకంగా రూ.47,500 జరిమానా విధించారు.

బుధవారం ఆచార్య విహార్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు ఆర్టీఓ అధికారులు. అటువైపు వచ్చిన ఓ ఆటోను ఆపారు. డ్రైవర్​ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శ్వాస పరీక్షలు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేల్చారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి హరిబంద్​పై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భారీగా జరిమానా వేశారు.

జరిమానా పూర్తి వివరాలు
  • సాధారణ నేరం కింద రూ.500 జరిమానా
  • అనుమతి లేని వ్యక్తి డ్రైవింగ్ చేసేందుకు ఒప్పుకున్నందుకు రూ.5000 జరిమానా
  • లైసెన్స్​ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ.5000 జరిమానా
  • మద్యం సేవించి డ్రైవింగ్ చేసినందుకు రూ.10,000 జరిమానా
  • వాయు, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.10,000 జరిమానా
  • రిజిస్ట్రేషన్​ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000
  • పర్మిట్ లేకుండా ఆటో నడిపినందుకు రూ.10,000
  • బీమా లేకుండా వాహనం నడిపినందుకు రూ.2000

ట్రాఫిక్​ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్​ వాహనాల చట్టాన్ని ఇటీవలే సవరించింది కేంద్రం. జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ నూతన చట్టం సెప్టెంబర్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

Last Updated : Sep 29, 2019, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details