తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాముడి జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి' - వెంకయ్య నాయుడు వ్యాఖ్య

రాముడి జీవితం చాలా మందికి ఆదర్శప్రాయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 'థవాస్మి' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

vekaiah naidu
'రాముడి జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి'

By

Published : Nov 6, 2020, 2:39 PM IST

నేటి తరం వాళ్లు రాముడి జీవితం నుంచి చాలా నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 'థవాస్మి: లైఫ్ అండ్ స్కిల్స్ త్రూ ద లెన్స్ ఆఫ్ రామాయణ' పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

రాముడి మాటలు, నడవడిక.. అందరి జీవితాల్లో సత్యం, ధర్మం ఓ భాగమైపోవాలనే స్ఫూర్తిని నింపుతాయని వెంకయ్య నాయుడు అన్నారు. తల్లి, తండ్రి, తమ్ముడు, గురువు, శత్రువుతో రాముడు ప్రవర్తించిన తీరు.. జీవితంలో వచ్చే ఒడుదొడుకుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తాయని చెప్పారు.

" నాయకుడిగానూ రాముడు ప్రజల హృదయాల్లో నిలిపోయారు. రాముడి జీవిత చరిత్ర ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. వాల్మీకి రాసిన రామాయణం 'ఆదికావ్యం' మాత్రమే కాదు 'అనాది కావ్యం'".

-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

రామాయణంలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేస్తూ... ఎంతటి శిఖరాలకు చేరినా జన్మనిచ్చిన ప్రాంతానికి తిరిగి రావాలని చెప్పారు వెంకయ్య. యుద్ధం అనంతరం రాముడు లంకను విడిచి సొంత ప్రాంతానికి వచ్చే సందర్భాన్ని ఉదహరించారు.

ఇదీ చదవండి:అన్నాడీఎంకే X భాజపా: తమిళనాట 'యాత్ర రాజకీయం'!

ABOUT THE AUTHOR

...view details