తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: సిగ్నల్ కోసం ఎన్నికల బహిష్కరణ

హిమాచల్ ప్రదేశ్​లోని పంగి మండలం.. కొండల్లో విసిరేసినట్టు ఉంటుంది. నెట్​వర్క్ ఉండదు. మొబైల్ వాడకం కాదు చూసిన వారూ లేరు. నమ్మట్లేదు కదూ? ఇలాంటి కనీస మౌలిక వసతులు కల్పించనందుకు నిరసనగా ఈసారి ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు పంగి ప్రజలు.

పంగి

By

Published : Apr 4, 2019, 6:21 AM IST

Updated : Apr 4, 2019, 10:12 AM IST

నెట్​వర్క్ లేని ప్రాంతం పంగి
దేశమంతా డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతోంది. ఈ సాంకేతిక యుగంలో మొబైల్​ వాడకుండా ఉండగలమా? హిమాచల్​ప్రదేశ్​లోని ఓ మండలంలో ఇప్పటికీ మొబైల్ చూడని వారున్నారు. కొండల మధ్య ఉన్న పంగిలో ఏ మొబైల్ కంపెనీ నెట్​వర్క్ లేకపోవటమే ఇందుకు కారణం.

పంగి మండలంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. శీతకాలం వచ్చిందంటే ఆర్నెల్లపాటు రాకపోకలు ఉండవు. ఈ పరిస్థితి మార్చేందుకు 30 వేల మంది ఓటర్లు ఏకతాటిపైకి వచ్చారు. మండలానికి సొరంగమార్గంలో రోడ్డుతోపాటు నెట్​వర్క్ అందించేవరకు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు.

"ఇక్కడ ఒక బీఎస్​ఎస్ఎల్ టవర్ మాత్రమే ఉంది. అది నిరుపయోగంగానే ఉంది. ఇప్పటివరకు పంగిలో అంతర్జాలాన్ని ఉపయోగించినవారు లేరు. ఇక్కడ ఏ నెట్​వర్క్​ లేదు. ఇప్పటికీ ప్రజలు ఉత్తరాల ద్వారా యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు.

ఆదివాసీలను ప్రగతి పథంలోకి తీసుకురాలేకపోతే భారత్ ఎప్పటికీ సుభిక్షం కాలేదు. పంగికి టన్నెల్ నిర్మిస్తే అన్ని సమస్యలు తీరినట్టే. మిగతా అభివృద్ధి పనులను పక్కనబెట్టి టన్నెల్ నిర్మించండి. రేషన్ లేకున్నా బతకగలం. కానీ సౌకర్యాలు లేకుంటే కష్టమవుతోంది. ఇక్కడ వైద్య, విద్య సౌకర్యాలు ఏవీ లేవు.

మేం నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఈవీఎం ఖాళీగా వెళుతుంది. బటన్ నొక్కేదే లేదు. ప్రధాని కార్యాలయం, గవర్నర్, ఎన్నికల సంఘాలకు లేఖ రాశాం. ఎవరూ స్పందించలేదు. పంగిలోని 43 ప్రజాసంఘాలు కలిసి ఓటు వేయొద్దని అంతిమంగా నిర్ణయం తీసుకున్నాయి."
- స్థానికుడు, పంగి

ఇదీ చూడండి:వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

Last Updated : Apr 4, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details