ఉత్తరాఖండ్ ధార్చులా సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ రాసిన ఓ లేఖకు బదులిస్తూ.. వివాదాస్పద కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని ప్రకటించుకుంది నేపాల్. ఈ మూడు ప్రాంతాల్లో తమ దేశ ప్రజలకు తిరిగే స్వేచ్ఛ ఉందని తెలిపింది.
ధార్చులా ఎస్డీఎం అనిల్ శుక్లా... నేపాల్‌లోని ధార్చులా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాల్లో పలు నేపాలీ సంస్థలు అక్రమ చొరబాట్లకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు.
దీనికి స్పందనగా '1816 సుగౌలి ఒప్పందం ప్రకారం ఈ మూడు ప్రాంతాలు నేపాల్ భూభాగం కిందకే వస్తాయి. మా పౌరులకు అక్కడ పర్యటించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది' అని నేపాల్ అధికారి బదులిచ్చారు. ఈ లేఖను ట్విట్టర్లో షేర్ చేసి అధికారిపై ప్రశంసలు కురిపించారు నేపాల్ మాజీ ఉప ప్రధాని కమల్ థాప.
కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపే నూతన మ్యాప్‌ను ఇటీవలే ఏకగ్రీవంగా ఆమోదించింది నేపాల్ పార్లమెంట్. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇదీ చూడండి: చినాబ్ నదిపై ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన వంతెన